/rtv/media/media_files/2025/04/18/61fLnP8LibucFjfjhnuA.jpg)
Kalyan Ram
Kalyan Ram: నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun Son of Vyjayanthi) శుక్రవారం థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో కల్యాణ్‌రామ్ తన మనసులోని మాటలు పంచుకుంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!
ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశం తన కుమారుడికి బాగా నచ్చిందని తెలిపారు. "ఇప్పటివరకు భారతీయ సినిమాలో అలా ఓ ఎపిసోడ్ చూడలేదు నాన్నా, ఇది చాలా గర్వించదగ్గ విషయం" అని కుమారుడు చెప్పిన మాటలు తన హృదయాన్ని తాకినట్టు చెప్పారు. ఆ గర్వం తనను ఎంతో ఉల్లాసపరిచిందని అన్నారు.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
దర్శకుడిగా ప్రదీప్ చిలుకూరి అరంగేట్రం చేసిన ఈ చిత్రం, మొదటి రోజే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా శ్రీకాంత్ పోషించిన పాత్రలోని ట్విస్ట్ చాలా మందిని ఆశ్చర్యపరిచిందని కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. ఈ సినిమా తల్లిదండ్రులపై మన బాధ్యతను గుర్తు చేస్తుందంటూ భావోద్వేగంతో స్పందించారు.
Also Read: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.
కల్యాణ్‌రామ్ కెరీర్‌లో మరో హిట్
విజయశాంతి- కల్యాణ్‌రామ్ తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమాలో వారి ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ విలువలు, కుటుంబ సంబంధాల్లోని భావాల్ని స్పష్టంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, కల్యాణ్‌రామ్ కెరీర్‌లో మరో హిట్ గా నిలిచింది.
Also Read: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న మరో డైరెక్టర్..?
Follow Us