Weather Alert: ముంచుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ప్రస్తుతం చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలోని బేల ప్రాంతంలో నమోదైంది. 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు.
ఈశాన్య రుతుపవనాల వల్ల ఏపీకు నేడు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.