/rtv/media/media_files/2025/04/18/Hqzl8udbVNFIzYVOfcJg.jpg)
Urvashi Rautela claim of 'temple' in her name Badrinath Priests outrage
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అన్నీ అవాస్తవాలని అర్చకులు తెలిపారు. ఆమెను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంతకీ ఏం జరిగింది?.. ఊర్వశీ రౌతేలా చేసిన కామెంట్లు ఏంటి?.. అర్చకులు ఎందుకు ఫైర్ అయ్యారు?.. అనేది పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
నా పేరుతో ఆలయం - ఊర్వశీ
నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల ఒక నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఒక ఆలయం ఉందని తెలిపింది. అందువల్ల ఎవరైనా బద్రీనాథ్‌కు వెళితే పక్కనే ఉన్న తన ఆలయాన్ని సందర్శించండి అని చెప్పుకొచ్చింది. అది మాత్రమే కాకుండా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనూ తన ఫొటోకు పూలమాలలు వేసి తనను ‘దండమమాయి’ అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఇది నిజమని.. ఈ విషయం తెలిసి తాను కూడా ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది.
Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
అర్చకులు ఫైర్
ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ కావడంతో ఉత్తరాఖండ్ అర్చకులు తీవ్ర స్థాయి మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక అర్చకుడు భువన్ చంద్ర ఉనియాల్ స్పందించారు. బద్రినాథ్ దగ్గరలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఒక ఆలయం ఉందని అన్నారు. అది నిజమే అయినా.. ఆ ఆలయానికీ నటికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. శ్రీమహావిష్ణువు తొడ నుంచి పుట్టడం లేదా సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీ దేవి ఆలయంగా పురాణాలు, స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారని తెలిపారు.
అప్పటి నుంచి ఊర్వశీ దేవి ఆలయం ఉందని.. దానినే నటి ఊర్వశీ తన పేరుతో ఉన్న ఆలయమని చెప్పుకొని తిరుగడం ఏమాత్రం బాగోలేదని అన్నారు. ఇలా చెప్పి అందరినీ తప్పుదోవ పటిస్తున్నారని అర్చకుడు భువన్ తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా.. ఇక్కడి ప్రజలు 108 శక్తిపీఠాల్లో ఒకటిగా దేవతను కొలుస్తారని చెప్పుకొచ్చారు. ఇది ఆమె గుడి కాదని.. ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అందువల్ల ఊర్వశీ వ్యాఖ్యలపై స్పందించి.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా కఠినంగా వ్యవహరించాల్సిందేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.
Urvashi Rautela | Urvashi Rautela controversy | latest-telugu-news | telugu-news