ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు-PHOTOS
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నేటి నుంచి మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త నియమం అమలులోకి వచ్చాక ఫాస్టాగ్ లేని వాహనాలను అలిపిరి చెక్పోస్ట్ వద్ద కొండపైకి అనుమతించరు.
తన కోరిక తీర్చమని ఓ గ్రామ రెవెన్యూ అధికారిణి (వీఆర్ఓ)ను వేధించాడో ఎమ్మార్వో. అక్కడితో ఆగకుండా ఆమె ఇంటికే వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి వీఆర్ఓ తల్లి ఎమ్మార్వోపై చెప్పు చీపురుతో దాడి చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
చిత్తూరు జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ రైతుని బలితీసుకున్నాయి. కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు. 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులు ఉన్నాయి.
ఏపీలోని తిరుపతి జిల్లాలో తను ప్రేమించిన యువతిని దక్కించుకోవాలనుకున్న ఒక యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. అది కూడా అర్థరాత్రి కానీ, అతని ప్రయత్నం విఫలమవ్వడమే కాకుండా జనం చేతిలో తన్నులు తిన్నాడు. మల్లయ్యపల్లిలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
తిరుపతిలోని గాంధీపురంలో స్థానికంగా ఉన్న ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి అద్భుత ఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు గతంలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం
చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమలో మోసపోయిన ఓ యువతి తన ప్రియుడి ఇంటిముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. బాధిత యువతి 60 శాతం కాలిన గాయాలతో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.