/rtv/media/media_files/2025/09/23/ttd-2025-09-23-11-40-59.jpg)
TTD
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు(TTD Brahmotsavam) నేడు అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే నేడు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఉత్సవాలకు ముందు తప్పకుండా ఈ ఘట్టాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవాల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఈసారి 16 రకాల వంటకాలను పంపిణీ చేయనుంది. వాహన సేవలు చూసేందుకు మాడ వీధుల్లో నిల్చునే భక్తులకు ప్రతి 45 నిమిషాలకు 35 వేల మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల బయట ఉన్న భక్తుల కోసం 36 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌లను పెట్టారు.
ఇది కూడా చూడండి: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం..వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా..
దీనివల్ల భక్తులు(Devotees) ఎక్కడి నుంచైనా వాహన సేవలను చూడవచ్చు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులు శ్రీవారి ఆలయాన్ని అందంగా అలంకరించడానికి రూ.3.5 కోట్ల విలువైన 60 టన్నుల పువ్వులను ఉపయోగిస్తారు. 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 229 కళా బృందాలు ఈ ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. భక్తులకు సహాయం చేయడానికి 3,500 మంది శ్రీవారి సేవకులు సిద్ధంగా ఉన్నారు. కొండపైన ప్రతి 4 నిమిషాలకు ఒకసారి టీటీడీ, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. అవి భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తాయి. భక్తుల భద్రత కోసం 3 వేల సీసీ కెమెరాలను అమర్చారు. 2 వేల మంది టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, 4,700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులు భద్రతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రోజుకు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతారు.
ఇది కూడా చూడండి: Mahalaya Amavasya: మహాలయ అమావాస్య .. తిరుపతి కపిలతీర్థం ఆలయానికి పోటెత్తిన భక్తులు
సాధారణంగా రద్దీ సమయాల్లో భక్తులు రోజుకు దాదాపు 20 వేల చెప్పులను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. భక్తులు తమ చెప్పులను కౌంటర్ల వద్ద ఇస్తే, సిబ్బంది వారికి క్యూఆర్ కోడ్ ఉన్న స్లిప్ ఇస్తారు. ఈ స్లిప్‌లో ఉన్న నంబర్ ఆధారంగా భక్తులు తమ చెప్పులను తిరిగి తీసుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల చెప్పులు ఎక్కడ పడితే అక్కడ లేకుండా నిర్దిష్ట ప్రదేశాల్లోనే ఉంటున్నాయి. అక్టోబర్ 2 వ తేదీ ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. అయితే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.