/rtv/media/media_files/2025/04/22/pfFrREeVJdSapghKmrfB.jpg)
thirumla tirupathi devasthanam
నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతీ ఏడాది టీటీడీ ఈ బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సమయంలో ఎందరో భక్తులు స్వామి వారిని దర్శించుకుంంటారు. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఓ ముఖ్య కారణం ఉంది. వేంకటాద్రిపై ఆ ఏడు కొండల వాడు వెలిసిన తొలి రోజుల్లో బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణం కోసం ఉత్సవాలు జరపాలని చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఆ స్వామికి బాధ్రపదమాసంలో శ్రవణ నక్షత్రం పూర్తయ్యే సరికి బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. అప్పుడు బ్రహ్మ ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా పేరొందాయి. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూనే ఉన్నారు. ఎంతో ఘనంగా స్వామి వారి ఉత్సవాలను జరుపుతున్నారు.
ఇది కూడా చూడండి: Mahalaya Amavasya: మహాలయ అమావాస్య .. తిరుపతి కపిలతీర్థం ఆలయానికి పోటెత్తిన భక్తులు
బ్రహ్మ దేవుడే ముందు నిర్వహించాడని..
లోక కళ్యాణం, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించుకునేందుకు ఈ ఉత్సవాలను జరుపుతున్నారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. స్వామి వారికి మొదటిగా తొమ్మిది రోజుల పాటు ఈ పండుగలను జరిపారు. అయితే కొన్నిసార్లు తొమ్మిది, మరికొన్నిసార్లు పది రోజులు ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ గరుడ వాహనం, అశ్వ వాహనం, గజ వాహనం, హనుమంత వాహనం, సూర్య ప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం వంటి వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులు స్వామి వారికి దగ్గరగా ఉంటారని నమ్ముతారు. అయితే బ్రహ్మోత్సవాలను దర్శించిన వారికి, ఇందులో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని, వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అందూ ఈ ఉత్సవాలను చూడటానికి ఎందరో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శిస్తారు.
ఇది కూడా చూడండి:TTD: రేపటి నుంచే తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఈ 16 రకాల ప్రత్యేక వంటకాల గురించి మీకు తెలుసా?
ఈసారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఈసారి 16 రకాల వంటకాలను పంపిణీ చేయనుంది. వాహన సేవలు చూసేందుకు మాడ వీధుల్లో నిల్చునే భక్తులకు ప్రతి 45 నిమిషాలకు 35 వేల మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల బయట ఉన్న భక్తుల కోసం 36 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌లను పెట్టారు. దీనివల్ల భక్తులు ఎక్కడి నుంచైనా వాహన సేవలను చూడవచ్చు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.