/rtv/media/media_files/2025/10/10/tirupati-2025-10-10-21-10-32.jpg)
Fire Accident In Tirupati
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తు్న్నాయి. అగ్ని ప్రమాదం జరగడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సగానికి పైగా పరిశ్రమ దగ్ధమైంది. ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారి పక్కన పరిశ్రమ ఉండడంతో అటుగా వెళ్లే వాహన దారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరోవైపు తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గరుడ వారధి ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఇద్దరు మృతి చెందారు. యువకులు బైకుపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డారు యువకులు. ఘటనా స్థలంలో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుపై కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : వీడు మనిషి కాదు మృగం.. చెల్లిని తల్లిని చేసి..
Also Read : చెల్లిని పెళ్లిచేసుకున్నవాడు పొట్టిగున్నాడని..పొడిచి చంపేశాడు