AP Crime: చిత్తూరులో దారుణం.. మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారయత్నం

చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న నగరవనం పార్క్‌కు వెళ్లిన ఓ ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడిని బంధించి ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

New Update
father rape attempt to daughter in secunderabad

Chittoor Crime News

ఆంధ్రప్రదేశ్‌లో మైనర్ బాలికపై ముగ్గురు మృగాలు రెచ్చిపోయారు. మైనర్ బాలికపై అత్యాచారం చేయటం అనేది క్రూరమైన నేరం. ఇది శారీరక దాడితోపాటు మానసిక, భావోద్వేగ జీవితాన్ని ఆగం చేసే భయంకరమైన చర్య. ఈ దారుణ సమాజంలో చిన్నారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టే చర్యపై పోక్సో (P OCSO - Protection of Children from Sexual Offences) చట్టం వంటి కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ములనా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేరానికి పాల్పడేవారికి కఠిన శిక్షలు వేయటంతోపాటు బాధితులకు తక్షణ న్యాయం, మెరుగైన పునరావాసం కల్పించడం అత్యవసరం. అయితే తాజాగా ఓ మైనర్‌ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నం చేశారు. స్థానిక వివరాల ప్రకారం..

మైనర్ బాలికపై అత్యాచారం..

చిత్తూరు నగరంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 25వ తేదీన కాలక్షేపం కోసం నగరవనం పార్క్‌కు వెళ్లిన ఓ ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. వారిని బెదిరించిన దుండగులు మొదట వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నారు. అనంతరం యువకుడిని బంధించి ఆ మైనర్ బాలికపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

ఇది కూడా చదవండి: తమిళనాడులో దారుణం...ఆంధ్రయువతిపై ఖాకీ కామాంధుల అత్యాచారం

బాధితురాలు మైనర్ కావడంతో.. మొదట ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె ఫిర్యాదు చేయడానికి నిరాకరించింది. దీంతో కుటుంబ పెద్దల సహకారంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. నిందితులుగా మహేష్, హేమంత్ ప్రసాద్, కిషోర్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఈ ముగ్గురిపై పోక్సో (POCSO) చట్టం, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని డీఎస్పీ స్పష్టం చేశారు. నిందితులను త్వరలో పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్సీ తెలిపారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. టాబ్లెట్‌లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన కూతురు

Advertisment
తాజా కథనాలు