TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వారికి బీమా సదుపాయం!
తిరుమల భక్తులకు శుభవార్త చెప్పేందుకు TTD సిద్ధమైంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బీమా కల్పించాలని భావిస్తోంది.
తిరుమల భక్తులకు శుభవార్త చెప్పేందుకు TTD సిద్ధమైంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బీమా కల్పించాలని భావిస్తోంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి టీటీడీ మరోసారి నోటీసులు పంపింది. తాజాగా వీరు తిరుపతి వెళ్లగా దర్శనం తర్వాత వారు బస చేసిన అతిథిగృహం వద్ద మాధురి లంగావోణీలో రీల్స్ చేశారు. ఈ క్రమంలో టీటీడీ మరోసారి నోటీసులు పంపింది.
బస్సులో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా రెండు ఏనుగు దంతాలు బయటపడ్డాయి. వాటివిలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. కాగా నిందితులు శేషాచలం అడవుల నుంచి ఏనుగు దంతాలు తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ వేదిస్తోందని కానిస్టేబుల్ మదన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. గతంలో ఈ కానిస్టేబుల్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి గన్ మెన్ గా ఉన్నారు.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్కు ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు పోన్ చేసి బాంబులు పెట్టినట్లు బెదిరించారు. చెన్నైలోని సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి పోన్ చేసి షార్లో బాంబు పెట్టినట్లు దుండగులు వెల్లడించారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ ట్రాక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4నెలల చిన్నారి కూడా ఉంది.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కారు అదుపుతప్పి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. తిరుపతిలో ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతోంది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో పలువురు యువకులు డ్రగ్స్ తీసుకుంటుండగా ఫోటోలు తీశారు. స్వయంగా మత్తు ఇంజక్షన్లు యువత వేసుకుంటున్నారు.