AP Tirupathi: శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఇక తిరుపతి వెల్లడం మరింత ఈజీ!

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో విమానయాన శాఖ ఈ సర్వీస్‌ను తీసుకొచ్చింది.

New Update
Tirupathi

Tirupathi

తిరుమల శ్రీవారి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. దేశ, విదేశాల నుంచి ఈ ఆలయానికి భక్తులు వెళ్తుంటారు. శ్రీవారిని దర్శించుకోవడానికి కొందరు మూడు నెలల కిందట నుంచే బస్సు, ట్రైన్, ఫ్లైట్, దర్శనం టికెట్లు వంటివి బుక్ చేసుకుంటారు. సమయం లేని వారు విమాన సర్వీస్‌ను ఉపయోగించుకుంటారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో విమానయాన శాఖ ఈ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకించి తిరుపతి వెళ్లే వారికి కోసం మాత్రమే మరో విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. ఈ ప్రత్యేక విమాన సర్వీసు వల్ల భక్తులకు మరింత సౌకర్యం ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Tirupathi Bramosthavalu: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఫొటోలు చూశారా?

ఇది కూడా చూడండి: TTD: రేపటి నుంచే తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఈ 16 రకాల ప్రత్యేక వంటకాల గురించి మీకు తెలుసా?

ఎంపీ పురందేశ్వరితో కలిసి..

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి వర్చువల్‌గా రాజమహేంద్రవరాన్ని తిరుపతికి నేరుగా అనుసంధానం చేస్తున్న మొదటి విమానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బచ్చయ్య చౌదరి,  రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజా నగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు తదితర విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు