Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 60 మంది మృతి
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరిక్ ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దుధియా బ్రిడ్జ్ కూలిపోయింది.
బీహార్‌లో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటు కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ రోజు నగరంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఎంజీబీఎస్ వరద నుంచి తేరుకుంది. బస్టాండ్‌కు వచ్చే మార్గంలోని శివాజీ బ్రిడ్జి, ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాం 56, 58, 60 వద్ద పేరుకుపోయిన బురదను శుభ్రం చేశారు. ప్రస్తుతం బస్సు సర్వీసులు ఎంజీబీఎస్ నుంచే ప్రారంభించారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసీ నది ఉప్పొంగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. మూసీ నది ఉగ్రరూపం వల్ల చాదర్‌ఘాట్, ఎంజీబస్ స్టేషన్, మలక్ పేట్, అఫ్జల్ గంజ్, పాతబస్తీ డేంజర్లో ఉన్నాయి.
హైదరాబాద్ ను నిన్న రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. చంచల్ గూడ, రాజేంద్రనగర్, బండ్ల గూడ జాగీర్, నార్సింగి లలో కురిసన వర్షంతో జంట జలాశయాల గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీనది హైదరాబాద్ నగరం మధ్యలోకి వచ్చేసింది.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ విధించింది.
హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. నిన్నరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన నియోజకవర్గంలో వర్షాల వల్ల జరిగిన నష్టానికి రూ.100 కోట్ల పరిహారం ఇవ్వాలని నేరుగా వరల్డ్ బ్యాంక్‌కు లేఖ రాశారు. ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి కాకుండా ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం సంచలనంగా మారింది.