Sarpanch: నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలమూరు, ఎస్ఎల్బీసీ, దిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
ఇవాల్టి వరకు ఒక కథ..రేపటి నుంచి మరో కథ అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తెలంగాణలో ప్రభుత్వం ఉందో, నిద్రపోతోందో తెలియదు అని విమర్శించారు. ఇకపై నుంచి యుద్ధమే అంటూ హెచ్చరించారు.
బీఆర్ఎస్ మళ్ళీ మెరుగుపడుతోందని..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కావాలని తనను బద్నాం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికలు అయిపోయాక కూడా పార్టీలకు వణుకు పట్టుకుంది. ఎందుకంటే త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రారంభం కానుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తై లక్షల ఓట్లు తొలగించింది ఎన్నికల సంఘం.
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్‌కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇంకా రాబోయే మూడు రోజుల పాటు చలి తీవ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన హరినాథ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మొదట ఆత్మహత్యగా భావించినా.. హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. భార్య తన ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం చేసిందని పోలీసులు తెలిపారు.