Sarpanch: నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు

తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

New Update
Newly Elected Sarpanches, Ward members to take oath today

Newly Elected Sarpanches, Ward members to take oath today

తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 12702 గ్రామాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరగనున్నాయి. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతూ గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయనున్నారు.     

Also Read: పాలమూరు, దిండి ప్రాజెక్టుు ఎందుకు పూర్తి చేయలేదు..మంత్రి ఉత్తమ్

Newly Elected Sarpanches - Ward Members To Take Oath

ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత కొత్త సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ పంచాయతీ మొదటి సమావేశం నిర్వహిస్తారు. తమకు ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ పాలకవర్గం తీర్మానం చేస్తుంది. మరోవైపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Also Read: కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ వాడొద్దని ఆదేశం

ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు(panchayat-elections) డిసెంబర్ 11,14,17 తేదీల్లో మూడు దశల్లో ముగిసిన సంగతి తెలిసిందే. పంచాయతీ గడువు ముగిసి రెండేళ్లు దాటినా కూడా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్నాయి. ఇక గ్రామాల పూర్తి బాధ్యతలు ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. వాస్తవానికి డిసెంబర్ 20న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగాల్సి ఉండగా.. మంచి రోజులు లేవనే కారణంతో ప్రభుత్వం డిసెంబర్‌ 22కు ఈ కార్యక్రమాన్ని వాయుదా వేసిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు