KCR: నిన్నటి వరకు ఓ కథ..రేపటి నుంచి మరో కథ..ఐ యామ్ బ్యాక్ అంటున్న కేసీఆర్

ఇవాల్టి వరకు ఒక కథ..రేపటి నుంచి మరో కథ అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తెలంగాణలో ప్రభుత్వం ఉందో, నిద్రపోతోందో తెలియదు అని విమర్శించారు. ఇకపై నుంచి యుద్ధమే అంటూ హెచ్చరించారు.

New Update

యామ్ బ్యాక్ అంటున్నారుబీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం పని పడతా చెబుతున్నారు. ఇన్నాళ్ళు ఆ ప్రభుత్వానికి టైమ్ ఇచ్చామని...అందుకే ఏం మాట్లాడలేదని అన్నారు. కానీ ఇక మీదట అలా ఉండదని చెబుతున్నారు కేసీఆర్. ఇవాల్టి వరకు ఒక కథ..రేపటి నుంచి మరో కథ..అన్నొచ్చాడని ఢంకా బజాయించి మరీ చెప్పారు. కాంగ్రెస్ పని పట్టందే నిద్రపోనని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం..సర్వ భష్టం అని తిట్టిపోశారు. పచ్చి అబద్ధాలు, దొంగ వాగ్ధానాలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని...ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దద్దమ్మ ప్రభుత్వం..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సేపూ భూములను అమ్ముకుందామనే యావ లో ఉదని కేసీఆర్ విమర్శించారు. కేవలం 40 టీఎంసీల నీరే చాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఎలా రాశారు. అంత జ్ఞానం లేకుండా ఎలా ఉన్నా రంటూ విరుచుకుపడ్డరు. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిశ్చయించుకున్నానని...ఇక మీదకాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తానని చెప్పుకొచ్చారు. పాలమూరుపై కేంద్రాన్ని ఎండగడతాం, పెద్ద ఉద్యమాన్ని చేపడతామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటికే మోసం వచ్చేలా ఉందని...తాను రంగంలోకి దిగతప్పదని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ప్రధానంగా చర్చించాం. కేంద్ర రాష్ట్రాలు తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై చర్చించాం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 308 కి.మీ కృష్ణా నది పారుతుంది. ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 TMCల నీళ్లు పాలమూరు జిల్లాకు రావాలి. ప్రతిపాదిత ప్రాజెక్టులు మార్చొద్దని SRC స్పష్టంగా చెప్పింది. పాలమూరు ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్ట్‌ కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ను కలిసి చాలాసార్లు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకటించింది. సమైక్య పాలకులు కేటాయించకున్నా సుమోటోగా జూరాల ప్రాజెక్టుకు బచావత్‌ నీళ్లు కేటాయించారు. గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్‌ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు పునాదిరాళ్లు కూడా వేశారు.  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పేందుకు జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశా. కృష్ణా నది పారే జిల్లాలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఉండేది. అలాంటి వాటిని తమ ప్రభుత్వం బాగు చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భ్రష్టు పట్టించింది అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. మీ ఫ్యూచర్‌ సిటీ ఎవరికి కావాలి.? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ దందాలు. ఇప్పటి వరకు 105 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు చనిపోయారు. గురుకుల పాఠశాలల పిల్లలను సాదడమే చేతకావడం లేదు, ఫ్యూచర్‌ సిటీ కడతారట అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. 

Advertisment
తాజా కథనాలు