Telangana Crime News: పాల్వంచ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చీరతో భర్త గొంతు నులిమి చంపిన భార్య!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన హరినాథ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మొదట ఆత్మహత్యగా భావించినా.. హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. భార్య తన ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం చేసిందని పోలీసులు తెలిపారు.

New Update
Crime news

Crime news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన హరినాథ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మొదట ఆత్మహత్యగా భావించినా.. హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. భార్య తన ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం చేసిందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచకు చెందిన ధరావత్ హరినాథ్ భార్య శృతిలయ ప్రస్తుతం ములుగు జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. గతంలో ఆమె చర్ల మండలంలో పనిచేస్తున్న సమయంలో కొండా కౌశిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి వ్యవహారం గురించి తెలిసిన భర్త హరినాథ్ ఆమెను పలుమార్లు మందలించారు. ఈ విషయం పెద్దమనుషుల వరకు వెళ్లినా శృతిలయ ప్రవర్తనలో మార్పు రాలేదు. - wife-killed-husband

ఇది కూడా చూడండి: BEAKING: తెలంగాణలో దారుణ హత్య.. కత్తులు స్కూడ్రైవర్లతో పొడిచి..

ప్లాన్ ప్రకారమే చంపి..

తన బంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య(murder) చేసింది. ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున హరినాథ్ మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన శృతిలయ, తన ప్రియుడు కౌశిక్, అతని స్నేహితులు చెన్నం మోహన్, డేగల భానులను ఇంటికి పిలిపించింది. వీరందరూ కలిసి నిద్రిస్తున్న హరినాథ్‌ను గొంతునులిమి దారుణంగా హత్య చేశారు. ప్రాణం పోయిన తర్వాత ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. హరినాథ్ మృతదేహాన్ని ఇంటి వెనుక భాగానికి తీసుకెళ్లి స్లాబ్ హుక్కు చీరతో ఉరివేశారు. హత్య జరిగిన తర్వాత శృతిలయ ఏమీ తెలియనట్లుగా నటించింది. ఉదయం నిద్రలేవగానే తన భర్త ఉరివేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

ఇది కూడా చూడండి: Burqa: బురఖా ధరించలేదని భార్యాబిడ్డలను దారుణ హత్య.. ఆధార్ కార్డు కూడా!

మృతదేహం వద్ద కూర్చుని ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే తన కుమారుడి మృతిపై తల్లికి అనుమానం కలిగింది. హరినాథ్ శరీరం మీద గాయాలు ఉండటంతో అది ఆత్మహత్య కాదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో శృతిలయ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారికి అనుమానం బలపడింది. ఆమె కాల్ డేటా, వివాహేతర సంబంధం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. శృతిలయను ఆమె ప్రియుడిని విడిగా విచారించడంతో వారు చేసిన నేరాన్ని అంగీకరించారు. పథకం ప్రకారం హరినాథ్‌ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో శృతిలయతో పాటు ఆమె ప్రియుడు, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.20 ఏళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు