తెలంగాణలో SIR.. వణుకుతున్న పార్టీలు.. ఆ 50 లక్షల ఓట్లు ఔట్?

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాక కూడా పార్టీలకు వణుకు పట్టుకుంది. ఎందుకంటే త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రారంభం కానుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తై లక్షల ఓట్లు తొలగించింది ఎన్నికల సంఘం.

New Update
TG SIR

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాక కూడా పార్టీలకు వణుకు పట్టుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఓటర్ల జాబితా(voter-list) ప్రత్యేక సవరణ(SIR) త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(nationwide Special Intensive Revision) పూర్తైంది. దీనికి అక్కడి రాష్ట్రప్రభుత్వాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రులు, అగ్రనేతలే రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, ఆందోళనలకు దిగారు. ఆందోళనల మధ్యనే ఈ సర్ ప్రక్రియ ముగిసింది. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారులు ఒత్తిడికి గురైయ్యారు. డూప్లికేట్ ఓట్లను, మరణించిన వారి ఓట్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నారు. దీని కోసం తెలంగాణలో ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు తెలిసింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మూడో విడత కింద ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) చేపట్టేందుకు ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటించాక ఆ ప్రక్రియలో భాగమయ్యే అధికారుల బదిలీలపై ఆంక్షలు అమల్లోకి రానుండటంతో ఆలోగా పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు కొన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో 2025 సెప్టెంబర్ నాటికి సుమారు 3.35 కోట్ల ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 1.68 కోట్లు, పురుష ఓటర్లు 1.66 కోట్లు కాగా.. థర్డ్ జెండర్ 2,829 మంది. తెలంగాణలో కూడా దాదాపు ప్రస్తుతం ఉన్న ఓటర్లలో 50 లక్షలకు పైగా ఓట్లు ఎగిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు, అగ్రనేతలే ఆందోళనలు చేపట్టారు.

1. తమిళనాడు ఓటర్ల జాబితా నుంచి రికార్డు స్థాయిలో సుమారు 97.37 లక్షలు ఓట్లు తొలగించబడ్డాయి. ఇది మొత్తం ఓటర్లలో దాదాపు 15.2%.
మరణించిన వారు: 26.94 లక్షలు.
శాశ్వతంగా నివాసం మారిన వారు: 66.44 లక్షలు.
ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం: 3.98 లక్షలు.

2. పశ్చిమ బెంగాల్‌లో కూడా సుమారు 58.21 లక్షలు ఓట్లు తొలగించారు. మొత్తం ఓటర్లలో సుమారు 7.5% మేర కోత పడింది.
మరణించిన వారు: 24.17 లక్షలు.
అడ్రస్ దొరకని వారు: 32.65 లక్షలు.
డూప్లికేట్ ఓట్లు: 1.38 లక్షలు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 7తో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శుల పనితీరుపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్లుగా పనితీరు కనబర్చని అధికారుల స్థానంలో కొత్త అధికారులను నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో 'సర్'నిర్వహణ ఏర్పాట్లను పరిశీలనకు సీఈసీ జ్ఞానేశకుమార్ శనివారం హైదరాబాద్ చేరుకోవడంతో అధికార వర్గాల్లో బదిలీలపై చర్చ ప్రారంభమైంది. జ్ఞానేశ్ కుమార్ ఆదివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో బూత్అవల్ అధికారుల (బీఎల్డీ)తో సమావేశమై 'సర్' నిర్వహణ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో తదుపరి జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను బదిలీ చేసేందుకు అవ కాశం ఉండదు. ఆలోపే ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.

Also Read :  పాల్వంచ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చీరతో భర్త గొంతు నులిమి చంపిన భార్య!

రాహుల్ గాంధీ ఓటు చోరీ

బిహార్ ఎన్నికల్లో సర్ ప్రక్రియ వల్లే తాము ఓడిపోయామని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలు చేశారు. బిహార్ రాష్ట్రంతోనే సుప్రీం కోర్టుకు సర్ వివాదం ఎక్కింది. సుమారు 68.5 లక్షలు ఓట్లు బిహార్ లో తొలగించబడ్డాయి. జూన్ 2024 నాటికి 7.89 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, సెప్టెంబర్ 30, 2025 నాటి తుది జాబితా నాటికి 7.42 కోట్లకు తగ్గింది. అంటే మొత్తం ఓటర్లలో సుమారు 6 శాతం మేర ఓట్లు తగ్గాయి. ఇదే సమయంలో సుమారు 24 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. 

Also Read :  జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు.. BC రిజర్వేషన్‌పై రేవంత్ సర్కార్ ప్లాన్ ఇదే!

తెలంగాణలో సవాళ్లు.. 

సర్ ప్రక్రియకు కేంద్రం తెలంగాణలో రెండు ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కేంద్రం ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎండగట్టానికి సిద్ధంగా ఉన్నాయి. బిహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్‌లో కాంగ్రెస్ హోమ్ గ్రౌండ్ కాదు కాబట్టి, అక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉండటంతో కాంగ్రెస్ సర్ అడ్డుకోలేక పోయింది. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. ఇక్కడ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సర్ ప్రక్రియపై ఎలాంటి విధానం అవలంభిస్తారో చూడాలి. అంతేకాదు ప్రభుత్వం ఉద్యోగులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అయోమయంలో ఉన్నారు. ఎన్నికల సంఘం డ్యూటీలను చేయాలా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలా అనే సందేహంతో ఉన్నారు. సర్ జరిగిన రాష్ట్రాల్లో బీఎల్ఓలు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో సర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూడాలి మరి..

Advertisment
తాజా కథనాలు