/rtv/media/media_files/2025/10/13/india-to-witness-colder-winter-this-year-2025-10-13-10-31-47.jpg)
Winter
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు(telangana-weather-update) కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇంకా రాబోయే మూడు రోజుల పాటు చలి తీవ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని జిల్లాల ప్రజలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో అయితే సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలంలో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి చలి తీవ్రత బాగా పెరుగుతోంది.
ఇది కూడా చూడండి: BEAKING: తెలంగాణలో దారుణ హత్య.. కత్తులు స్కూడ్రైవర్లతో పొడిచి..
ఉదయం 10 గంటలు అయినా కూడా చలి తీవ్రత అసలు తగ్గడం లేదు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు తీవ్రమైన చలిగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం వేళల్లో రహదారులపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పనులకు వెళ్లే కూలీలు చలికి వణికిపోతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా ఆదిలాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో పాఠశాలల పనివేళల్లో మార్పులు చేశారు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 6 డిగ్రీల వరకు తక్కువగా ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రభావం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఉదయం, రాత్రి సమయాల్లో బయటకు రాకూడదని సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, సాక్సులు ధరించాలని వెల్లడించారు. గోరువెచ్చని నీరు తాగడంతో పాటు వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా చలి నుంచి రక్షణ పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Burqa: బురఖా ధరించలేదని భార్యాబిడ్డలను దారుణ హత్య.. ఆధార్ కార్డు కూడా!
Follow Us