Temperatures: ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్‌కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.

New Update
16 Epstein files

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి(winter) తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున 2 రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత(temperatures) సింగల్ డిజిట్‌కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటు తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి. అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ 6.7 డిగ్రీ సెల్సియస్, మెదక్ 7.4°C, హనుమకొండ 10°C, హైదరాబాద్‌లో 11. డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం 11.3°C, హయత్‌నగర్ 11.6°C, నిజామాబాద్ 12°C, ఖమ్మం 12.2°C, నల్గొండ 13°Cలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మహబూబ్‌నగర్‌లో 14.1 డిగ్రీల సెల్సియస్ చలి నమోదైంది.

Also Read :  చైనాకు చుక్కలు చూపించనున్న ఏపీ.. పాకిస్థాన్‌కు ఇక వణుకే

Temperatures Drop In Telugu States

అటు ఏపీలో కూడా ప్రజల్ని చలి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత విపరీతంగా పెరింగింది. దట్టమైన పొగమంచు అలుముకుంది. మినుములూరు, అరకులో 5°C ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 6°C, చింతపల్లిలో 9.2°C రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి కూడా పెరిగిపోయింది. వంజంగి, మాడగడ మేఘాలకొండకు టూరిస్టుల రద్దీ  పెరిగిపోయింది. 

Also Read :  ఆంధ్రాతీరం భారత్‌కు బంగారు గని.. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే!

Advertisment
తాజా కథనాలు