BIG BREAKING: రేవంత్ సర్కార్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ మళ్ళీ మెరుగుపడుతోందని..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కావాలని తనను బద్నాం చేస్తోందని ఆరోపించారు. 

New Update
kcr

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తనను దూషించడం, చనిపోవాలని శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు దారులు సత్తా చాటారని...ఎన్నికల ఫలాతాల్లో సత్తా చాటారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ లో కేసీఆర్ ఉత్సాహంగా మాట్లాడారు. తాను ఎక్కడికీ పోలేదని..బీఆర్ఎస్ బాగు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. 

బీఆర్ఎస్ సత్తా చాటింది..

రేవంత్ ప్రభుత్వం తనను కావాలనే టార్గెట్ చేసిందని కేసీఆర్ అన్నారు. నన్ను తిడుతూ అవమానించడమే ఈ ప్రభుత్వ విధానమని విరుచుకుపడ్డారు.పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే మన సత్తా తెలిసేది అన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడలేదని...కానీ కాంగ్రెస్ అలా లేదని కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తోంది..ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని కేసీఆర్ దుయ్యబట్టారు. 
ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించింది, మా హయాంలో రైతుల దగ్గరకే యూరియా వచ్చేది. రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడామడా తిట్టేశారు. చెక్‌డ్యామ్‌లను పేల్చుతున్నారు . BRS అధికారంలోకి వచ్చాక చెక్‌డ్యామ్‌లు పేల్చినోడిని..పాతాళంలో ఉన్న పట్టుకొస్తామంటూ పార్టీ నేతలకు చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు