/rtv/media/media_files/2025/07/07/mp-kangana-ranaut-2025-07-07-17-42-35.jpg)
MP Kangana Ranaut
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం మండి ఎంపీ కంగనా రనౌత్ ఆదివారం అక్కడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కానీ అక్కడి వారికి సాయం చేసేందుకు నిధులు లేవని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేతలు ఆమెపై విమర్శలు చేశారు. కంగనా ప్రజలకు ఎలాంటి సాయం చేయడం లేదంటూ మండిపడ్డారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తాను మండికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు సాయం చేయడానికి తాను కేంద్రమంత్రిని కాదని అన్నారు.
Also Read: వామ్మో.. మనిషిని మింగేసిన భారీ కొండచిలువ.. వీడియో వైరల్
Also Read : మోటార్లను ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు..హరీశ్ రావుకు ఉత్తమ్ కుమార్ కౌంటర్
I Don't Have Funds - Kangana Ranaut
విపత్తు నిర్వహణ విధులు అందించేందుకు నా వద్ద డబ్బు లేదని చెప్పిన మాటల్లో తప్పేముందని అన్నారు. తన పరిస్థితిని మాత్రమే అక్కడి ప్రజలకు చెప్పినట్లు పేర్కొన్నారు. '' వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు నేను ఎంపీగా ఏం చేయగలనో చెప్పాను. నిధులు లేనప్పుడు ఒక ఎంపీగా ఆందోళన లేవనెత్తాల్సిన బాధ్యత నాపై ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తాను. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. పైగా నేను చెసిన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటు'' కంగనా ధ్వజమెత్తారు.
Also read: ఛీ.. ఛీ.. ఇంటర్నెట్‌కు కూడా ఇబ్బందులు.. పాక్ నుంచి పారిపోతున్న కంపెనీలు!
ఇదిలాఉండగా.. గత కొన్నిరోజులుగా హిమాచల్‌ప్రదేశ్ భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. ఈ ప్రభావం వల్ల మండి జిల్లాలో ఇప్పటిదాకా 75 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కంగనా ఆదివారం ఆ ప్రాంతంలో సందర్శించారు. తునాగ్‌లోని వరద బాధితులతో ఆమె మాట్లాడారు. వరద ప్రభావానికి గురైన కుటుంబాలను ఆదుకుందామంటే తన వద్ద ఎలాంటి విపత్తు సహాయ నిధులు గానీ, క్యాబినెట్ పదవి గానీ లేదని అన్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు ఆమెపై విమర్శలు చేశారు. వరదలో అన్ని పోగొట్టుకున్న ప్రజలను మరింత బాధపెట్టేలా ఆమె వ్యాఖ్యానించారని.. ఇది సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఇస్రో ఛైర్మన్‌తో స్పేస్ నుంచి శుభాంశు శుక్లా ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారంటే ?
kangana-ranaut | floods | Himachal Pradesh | rtv-news | telugu-news