/rtv/media/media_files/2025/07/07/pakistan-network-speed-2025-07-07-13-07-26.jpg)
Pakistan Network speed (AI Image)
పాకిస్తాన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే దీనికి గల కారణాలను మైక్రోసాఫ్ట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే పాక్‌లో ఇంటర్నెట్ సమస్యల వల్లే మైక్రోసాఫ్ట్ వదిలి వెళ్లిపోయిందని సమాచారం. ఈ సంస్థే కాదు.. గతంలో ఎన్నో సంస్థలు పాక్‌ను వదిలి వెళ్లిపోయాయి.
ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్లేనా..
పాకిస్తాన్‌లోని టెక్ కంపెనీలకు ఇంటర్నెట్ సేవలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫైర్‌వాల్ వ్యవస్థ కారణంగా నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సిస్టమ్స్ కూడా పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఈ సమస్యలపై పాక్ బిజినెస్ కౌన్సిల్, పాక్ సాఫ్ట్‌వేర్ హౌస్ అసోసియేషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కానీ నెట్‌వర్క్ స్పీడ్ మాత్రం పెంచలేదు.
ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
ఫైర్‌వాల్‌లో తరచుగా సమస్యలు రావడం వల్ల చాలా కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్లాలని చూస్తున్నాయని కూడా PSHA తెలిపింది. అయితే ఈ నేషనల్ ఫైర్‌వాల్ కారణంగా నెలకు 300 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని PSHA అంచనా వేసింది. ఇప్పటికీ పాకిస్తాన్‌లో 4జీ నెట్‌వర్క్ నడుస్తోందట.
ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
పాకిస్తాన్‌లో నెట్‌వర్క్ వల్ల వచ్చిన ఇబ్బందులను తట్టుకోలేక ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీలు తమ ఆస్తులను స్థానిక కంపెనీలకు అమ్ముకుని వెళ్లిపోయాయి. ఉబెర్, ఫైజర్, షెల్, ఎలీ ఇల్లీ, సనోఫి, టెలినార్, లొట్టోకెమికల్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా పాకిస్తాన్‌ను విడిచి వెళ్లిపోయాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు టెక్ కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్తుంటే.. గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి:IND vs ENG : ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా : రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!