/rtv/media/media_files/2025/07/07/lovers-suicide-2025-07-07-16-41-39.jpg)
Lovers' suicide
ప్రేమకోసం చంపడానికి , చావడానికి కూడా నేటి యువత వెనుకాడటం లేదు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడితే ప్రేమకు అడ్డువస్తున్నారని తల్లిని, తండ్రిని చంపుతున్నారు కొందరు. ఇక కొందరైతే తన ప్రేమను ఒప్పుకోలేదని ఏకంగా ప్రియురాలిని హత్య చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లడూడ బాలాజీ నగర్‌లో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. కాగా చనిపోయిన యువతి ని రమ్యగా, యువకున్ని ప్రవీణ్ గా గుర్తించారు.
ఇది కూడా చూడండి: Director Sandeep Raj: చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..
Lover's Suicide In Sangareddy District
అయితే యువతి గొంతుపై కత్తి గాట్లతో రక్తపు మడుగులో పడి ఉంది. ఇక ఆమె పక్కనే పడి ఉన్న ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ యువతి మెడపై కత్తి నాట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారా? లేక యువతిపై ప్రవీణ్ దాడి చేసి ఆపై ఆత్మహత్యకు యత్నించాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి:AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
మృతురాలు రమ్య డిగ్రీ చదువుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆకుల ప్రవీణ్, రమ్య ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇద్దరి మధ్య వివిధ కారణాలతో గ్యాప్ ఏర్పడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యువతి ఇంట్లో గొంతుపై కత్తి గాట్లతో రమ్య పడి ఉండటం, ఆమె పక్కనే ప్రవీణ్ పడిఉండటం అనుమానాలకు తావిస్తోంది. రమ్యను కత్తితో నరికి ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా అని తెలియాల్సి ఉంది. అయితే వారి ప్రేమకు రమ్య తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో బ్లేడుతో కోసుకుని ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రమ్య మృతి చెందగా, ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆర్సీపురం పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి:Eggs: గుడ్లు ఎవరు తినొద్దు ఎప్పుడు తినొద్దు? తింటే కలిగే చెడు ప్రభావాల గురించి ఇప్పుడే తెలుసుకోండి
Also Read : అమ్మో.. రామయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
crime news telugu | crime news today | crime news in telugu | crime news | lovers suicide incident | lovers-suicide | attempted-suicide | sangareddy