Monta Toofan: మొంథా తుఫాన్.. వరద నీటిలో గల్లంతై ఏడుగురు మృతి!
ఉమ్మడి వరంగల్ మొంథా తుఫాన్ పెను విషాదాన్ని మిగిల్చింది. వరద నీటిలో గల్లంతై ఏడుగురు మృతి చెందారు. మృతులను కృష్ణమూర్తి, సూరమ్మ, శ్రీనివాస్, నాగేంద్ర, శ్రావ్య, సంపత్, అనిల్ గా గుర్తించారు.
ఉమ్మడి వరంగల్ మొంథా తుఫాన్ పెను విషాదాన్ని మిగిల్చింది. వరద నీటిలో గల్లంతై ఏడుగురు మృతి చెందారు. మృతులను కృష్ణమూర్తి, సూరమ్మ, శ్రీనివాస్, నాగేంద్ర, శ్రావ్య, సంపత్, అనిల్ గా గుర్తించారు.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్ క్రాస్ రోడ్డు దగ్గర పెళ్లి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బోర్ బోర్‌వెల్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి
తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు.
గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి, ఈరోజు ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చిన శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాల్పడింది.
వరంగల్ జిల్లా హనుమకొండ పట్టణంలోని నయీంనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇక్కడి తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సురజిత్ ప్రేమ్ అనే విద్యార్థి తలనొప్పితో ఈ రోజు మరణించాడు.
వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై విచారణ చేసిన ఇంటెలిజెన్స్ పోలీసులు నిజమేనని తేల్చినట్లు ప్రచారం సాగుతోంది.
పండగ పూట పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. ఈ ఘటన వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మి, నలుగురు పిల్లల సహకారంతో భర్త అశోక్‌ను చీరతో ఉరి బిగించి హత్య చేసింది. వివాహేతర సంబంధంపై నిలదీయడమే ఈ హత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.