జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్‌తో హంగ్‌

జనగామ మున్సిపాలిటీలో అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం అక్కడ 'హంగ్' ఏర్పడింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

New Update
congress VS BRS

జనగామ మున్సిపాలిటీలో అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం అక్కడ 'హంగ్' ఏర్పడింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. మొత్తం 26 వార్డుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు సగం సగం స్థానాలు గెలుచుకున్నాయి.

బలబలాలు ఇలా..

BRS: ఒంటరిగా 13 స్థానాలను కైవసం చేసుకుంది.

కాంగ్రెస్ కూటమి: కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందగా, మిత్రపక్షమైన సీపీఎం 1 స్థానాన్ని సాధించింది. దీంతో వీరి బలం కూడా 13కు చేరింది.

ఎక్స్ అఫీషియో ఓట్లు: ఇరు పార్టీలకు చెరో 3 ఓట్లు ఉండటంతో ఇక్కడ కూడా టై ఏర్పడింది. మున్సిపాలిటీలో గెలిచిన నలుగురు ఇండిపెండెంట్లలో ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ వైపు, మరో ఇద్దరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పక్షాలు సమాన బలంతో ఉండటంతో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మద్దతు కూడగట్టుకునేందుకు ఇరు పార్టీల నాయకులు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు