/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
Cybercriminals harass man, commits suicide
suicide : సైబర్ నేరగాళ్ల వేధింపులు(Cyber crime call) తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా మానసికంగా వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. ములుగు జిల్లా(mulugu-district) వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read : ఒకపుడు రైజింగ్ బిజినెస్ స్టార్.. నేడు కటకటాల్లోకి..
Cybercriminals Harass Man
పోలీసులు తెలిపిన వివరాలు, మృతుడు రామరావు రాసిన ఆత్మహత్య లేఖను అనుసరించి వివరాలు ఇలా ఉన్నాయి. రామరావు ఫోన్‌ను గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు(cybercriminals) హ్యాక్ చేశారు. అనంతరం ఆయన వ్యక్తిగత విషయాలు ఆరాతీస్తూ గత మూడు రోజులుగా నిరంతరం ఫోన్ చేస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ వేధింపులను ఎవరికి చెప్పుకోలేక, వాటిని భరించలేక రామారావు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో రామారావు మృతి చెందాడు. కాగా ఆయన చనిపోయే తన చావుకు దారి తీసిన పరిస్థితులను సూసైడ్ నోట్‌గా రాశాడు. తన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన సైబర్ నేరగాళ్లు, ఫోన్ హ్యాక్ చేసి తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. తన ప్రాణం పోవడానికి కారణమైన సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదనతో కూడిన నోటును ఆయన రాశారు.రామారావు మృతితో తిప్పాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. - Cyber ​​Crime
Also Read : కుత్బుల్లాపూర్‌లో మహిళా ఫిజియోథెరపీస్ట్ డాక్టర్ ఆత్మహత్య
Follow Us