/rtv/media/media_files/2026/02/08/rocket-launch-2026-02-08-18-05-17.jpg)
వరంగల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన ఓరుగల్లు గడ్డపై తొలిసారిగా ఒక మోడల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి పరాక్రమానికి గుర్తుగా ఈ మోడల్ రాకెట్‌కు రుద్రమ అని నామకరణం చేశారు. ISRO స్పేస్ ట్యూటర్, ATDRL వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో ఈ ప్రాజెక్టు రూపొందింది. ఈ ప్రయోగానికి వరంగల్ NIT, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాయి.
Also Read : ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంలో.. కాలి బూడిదైన ఓటుకు నోటు కేసు ఆధారాలు
Rudrama Rocket Launch
Unveiling the Rocket
— Venkatram Reddy Engala (@EVenkatReddy) February 3, 2026
“Rudrama V.01” -
On the occasion of National Science Day, 28 February, ATDRL Space Research Lab a startup based in Warangal in association with Kakatiya Urban Development authority (KUDA) will host the first public model rocket launch at Kaloji… pic.twitter.com/jNNIK7Q9qJ
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని ఫిబ్రవరి 28న హయగ్రీవాచారి మైదానం, హనుమకొండలో ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై ప్రత్యేక అవగాహన సదస్సు ఉంటుంది. సదస్సు ముగిసిన వెంటనే 'రుద్రమ' రాకెట్‌ను ప్రయోగిస్తారు.
కేవలం రాకెట్ ప్రయోగంతోనే ఆగకుండా, నగరావాసుల్లో అంతరిక్షంపై ఆసక్తిని పెంచేందుకు మరిన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 15 నుండి 27 వరకు సిటీలో కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన అత్యాధునిక టెలిస్కోపుల ద్వారా ప్రజలు నక్షత్రాలను, గ్రహాలను వీక్షించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు.
Also Read : హీరో మంచు విష్ణుకు బిగ్ షాక్..
విద్యార్థులకు ఉచిత ప్రవేశం
భావి తరాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులకు మరియు ఆసక్తి గల పౌరులకు ప్రవేశం పూర్తిగా ఉచితం. వరంగల్ నగరంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ అంతరిక్ష వేడుక అటు విద్యార్థుల్లో, ఇటు సామాన్య ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఓరుగల్లు గడ్డపై ఒక ప్రైవేట్ స్టార్టప్ మరియు ప్రభుత్వ సంస్థల కలయికతో జరుగుతున్న ఈ ప్రయోగం భవిష్యత్తులో మరెన్నో అంతరిక్ష పరిశోధనలకు స్ఫూర్తిగా నిలవనుంది.
Follow Us