/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో 8 వార్డులను ఆ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 6 వార్డుల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందారు. నియోజకవర్గ కేంద్రం డోర్నకల్ లోనూ కాంగ్రెస్ దూసుకుపోతోంది. 11,12, 3, 7, 2, 10 వార్డుల్లో విజయం సాధించింది. 15 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ సులువుగా కైవసం చేసుకోబోతోంది. ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం కోసం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్ విశ్వప్రయత్నాలు చేశారు. ఆయనతో పాటు పార్టీ ఇన్ఛార్జి రాకేష్ రెడ్డి సైతం విస్తృతంగా పర్యటించారు. కానీ ప్రభుత్వ విప్ రాంచద్రనాయక్ వ్యూహాల ముందు వారి అస్త్రాలు పని చేయలేకపోయాయి.
Follow Us