/rtv/media/media_files/2026/03/03/dog-2026-03-03-07-02-23.jpg)
shocking incident in jadcherla govt hospital
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ (32) అనే వ్యక్తి ఇంటి నుంచి బయటికెళ్లారు. ఆయన రాత్రి వరకు రాలేదు. చివరికి సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవమై తేలాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జడ్చర్ల మార్చురీకి తరలించి నేలపై ఉంచారు.
Also Read: జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి, 76 మందికి పైగా తీవ్ర గాయాలు
Shocking Incident In Jadcherla Govt Hospital
అక్కడ భద్రత లేకపోవడంతో ఓ కుక్క లోపలికి చొరపడింది. శవాన్ని పీక్కుతింటూ కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలాఉండగా 2023లో జడ్చర్లలో 30 పడకల ఆస్పత్రిని 100 పడకలకు పెంచారు. కానీ మార్చురీకి సంబంధించిన వస్తువులు, ఇతర పరికరాలు ఇంకా అందుబాటులో లేవు. ఈ క్రమంలోనే పాత ఆస్పత్రిలోనే ఉన్న మార్చురీలో పోస్టుమార్టం చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం కూడా ఓ మృతదేహాన్ని మార్చురీకి తీసుకొచ్చారు. అక్కడ సరైన వసతులు లేక రాత్రంతా అంబులెన్సులో ఉంచి ఉదయం పోస్టుమార్టం చేయాల్సి వచ్చింది. అక్కడి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం..శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ
Follow Us