BRS: ఎర్రబెల్లికి ఝాన్సిరెడ్డి ఝులక్.. కాంగ్రెస్ ఖాతాలోకి తొర్రూరు మున్సిపాలిటీ!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS మెజారిటీతో గెలిచిన ఏకైక స్థానం తొర్రూరు డైలామలో పడింది. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా, BRS 9, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధించింది. పాలకుర్తి MLA, వరంగల్ MP ఎక్స్ అఫిషియో సభ్యులుగా తొర్రూరు మునిసిపాలిటీలో నమోదు చేసుకున్నారు.

author-image
By K Mohan
New Update
thorrur

హంగ్ మునిసిపాలిటీల్లో పాగా వేసేందుకు ఎక్స్ అఫీషియో అస్త్రం వాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు మునిసిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు ఏర్పడగా, ఎక్స్ అఫీషియో సభ్యులనమోదుతో మూడు కాంగ్రెస్ ఖాతాలో చేరుతున్నాయి. అయితే హంగ్ వచ్చిన జనగామ(janagama) తో పాటు బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుచుకున్న తొర్రూ రు(Thorrur Municipal Election) లో పీషియో సభ్యుల నమోదుతో నువ్వా నేనా అన్నట్లు చెరి సమాన ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో ఓరుగల్లు రాజ కీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది.

మునిసిపాలిటీ(Municipal Election 2026) ల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదు శనివారంతో పూర్తయింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఆదేశాలను జారీ చేసింది. లోక్సభ సభ్యుడు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏ మునిసిపాలిటీలోనైనా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు. అయితే ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు మాత్రం తనకు ఓటు హక్కు ఉన్న మునిసిపాలిటీల్లోనే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదుకు అవకాశం ఇచ్చింది. సదరు మునిసిపాలిటీలో ఓటరు జాబితాలో పేరు లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేస్తే చెల్లని ఓటుగా పరిగణిస్తామని పేర్కొంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు కాలేకపోయారు.

Also Read :  కొత్తగూడెంలో కాంగ్రెస్ కొత్త మెలిక.. సీపీఐకి బిగ్ షాక్ ఇచ్చిన పొంగులేటి!

Jhansi Reddy Gave Shock To Errabelli

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ మెజారిటీతో గెలిచిన ఏకైక స్థానం తొర్రూరు డైలామలో పడింది. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధించింది. అయితే శనివారం స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వసినిరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తొర్రూరు మునిసిపాలిటీలో నమోదు చేసుకున్నారు. దీంతో ఇక్కడ మొత్తం ఓట్ల సంఖ్య 18కి చేరింది. బీఆర్ఎస్‌కు గెలిచిన తొమ్మిది సీట్లు ఉండగా, కాంగ్రెస్‌కు గెలిచిన 7ఓట్లతో పాటు రెండు ఎక్స్ అఫిషియో ఓట్లతో తొమ్మిదికి చేరింది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెరిసగం ఓట్లు ఉండటంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను క్యాంప్‌కు తరలించాయి. క్యాంపులో అభ్యర్థులుంటే ఇరు పార్టీలు వారి బంధువులతో బేరసారాలకు దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇక జనగామ మునిసిపాలిటీ పాలిట్రిక్స్ ఉత్కంఠ రేపు తున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ 12, సీపీఎం 1తో పాటు ఇద్దరు స్వతంత్రులతో కలిపి మొత్తం 15 మంది క్యాంపునకు వెళ్లారు. బీఆర్ఎస్ 13 వార్డులు, ఇద్దరు స్వతంత్రులతో కలిపి 15 మంది కూడా క్యాంపునకు వెళ్లారు. అయితే జనగామ ఎమ్మెల్యేతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలను ఎక్స్ ఎఫీషియో సభ్యులుగా నమోదు చేయాలని బీఆర్ఎస్ భావించింది. దీంతో 18మంది సభ్యుల బలం చేకూరుతుందని అంచనా వేసింది. అయితే ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదులో కొత్త నిబంధనలు తెరపైకి రావటంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక్కరే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు అయ్యారు. మిగతా ఇద్దరి దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. దీంతో బీఆర్ఎస్ బలం 16కు చేరింది. అయితే కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని జనగామలో ఎక్స్ట్రాపీషియో సభ్యుడిగా నమోదు చేశారు. దీంతో కాంగ్రెస్‌కు కూడా 16మంది బలం చేకూరింది. రెండు పార్టీల బలం ఎక్స్ అఫిషియో ఓట్లతో సమానంగా ఉండటంతో ప్రత్యర్థి క్యాంపులో ఉన్న కౌన్సిలర్లకు గాలం వేస్తున్నారు. ఓ కౌన్సిలర్ భర్తకు ఏకంగా రూ.2కోట్లు, కారు గిఫ్ట్ ఇస్తామని ఓ పార్టీ ఆఫర్ ఇచ్చిందట. అంతేకాకుండా అవసరమైతే వైస్ చైర్మన్ కూడా ఇస్తామని హమీ ఇస్తున్నారు. దీంతో ఎవరు ఏ క్యాంపు నుంచి గోడ దూకుతారో అనే ఉత్కంఠ జనగామ మునిసిపాలిటీలో నెలకొంది. - Municipal Election Results 2026

Also Read :  కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న బీజేపీ.. కమలం గూటికి మరో ఇద్దరు స్వంతంత్రులు

Advertisment
తాజా కథనాలు