Bandla Ganesh: బండ్ల గణేశ్‌ ఇంటికి క్యూ కట్టిన టాలీవుడ్..ఎందుకో తెలుసా?

బండ్ల గణేష్‌ ప్రతి ఏడాది దీపావళి రోజున ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. ఈసారి కూడా తన ఇంట్లో 'బండ్ల దివాళీ 2025' పేరుతో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తో పాటు పలువురు స్టార్ హీరోలు, దర్శకులు పాల్గొన్నారు.

New Update
Bandla Ganesh

Bandla Ganesh grand Diwali celebrations

Bandla Ganesh Diwali : బండ్ల గణేష్‌(producer-bandla-ganesh) అనగానే మనకు ఒక కమెడియన్‌ తో పాటు భారీ పెట్టుబడులతో చిత్రాలు నిర్మించిన విషయం గుర్తుకు వస్తుంది. చిన్న కమెడియన్‌గా ఉన్న బండ్ల గణేష్‌ ఫౌల్ట్రీ వ్యాపారంలో రాణించి  లాభాలు గడించారు. తద్వారా నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మించారు. కాగా బండ్ల గణేష్‌ ప్రతి ఏడాది దీపావళి రోజున బండ్ల దివాళీ పేరుతో ఉత్సవాలు(Happy Diwali Celebrations) నిర్వహిస్తుంటాడు. దానికి పలువురు టాలీవుడ్‌ నటులను కూడా ఆహ్వానిస్తాడు. ఈసారి కూడా బండ్ల గణేష్ తన ఇంట్లో 'బండ్ల దివాళీ 2025' పేరుతో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), విక్టరీ వెంకటేష్(victory-venkatesh) తో పాటు పలువురు స్టార్ హీరోలు, దర్శకులు హాజరయ్యారు. అంతేకాదు బండ్ల గణేష్ తో విభేదాలున్నా యని ప్రచారం సాగిన దర్శకుడు హరీష్ శంకర్ కూడా పార్టీకి రావడం విశేషం. ఈ సందర్భంగా తేజ సజ్జాపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. 

Also Read :  వామ్మో.. రూ. 150 కోట్లతో యాడ్ షూటా! అట్లీ డైరెక్షన్ లో శ్రీలీల, రణ్‌వీర్ సింగ్!

Tollywood Queued Up For Bandla Ganesh's House

గణేష్‌ ప్రతీ ఏడాది దీపావళి పండగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా తన ఇంట దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఈసారి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు పలువురు సినీ ప్రముఖులు సంబురాల్లో పాల్గొన్నారు. స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, కుర్ర హీరోలు, అగ్ర నిర్మాతలు బండ్ల ఇంట్లో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ వంటి  టాలీవుడ్ సీనియర్ హీరోలు బండ్ల గణేష్ దీపావళి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరుకి ఎదురెళ్లి ఆయన కాళ్లకి నమస్కరించారు బండ్ల గణేష్.


అయితే బండ్ల గణేష్‌ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. గత కొంతకాలంగా రాజకీయాల్లో అడుగుపెట్టడమేకాక ఎమ్మెల్సీ టికెట్‌ ఆశించినప్పటికీ ఆయనకు టికెట్‌ రాలేదు. సినిమాలు చేయనప్పటికీ  సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను ఎక్స్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. అయితే బండ్ల గణేష్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగాంగనే ఇండస్ట్రీ మొత్తాన్ని  పిలిచి తన ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశాడు.  వెంకటేష్, సిద్దు జొన్నలగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, శ్రీకాంత్ లాంటి పెద్ద పెద్ద వారందరూ హాజరయ్యారు. 

Also Read :   దివ్వెల మాధురికి నాగార్జున ఫుల్ సపోర్ట్.. అసలు విషయం ఎలా బయటపెట్టాడో చూడండి!

Advertisment
తాజా కథనాలు