Chings Add: వామ్మో.. రూ. 150 కోట్లతో యాడ్ షూటా! అట్లీ డైరెక్షన్ లో శ్రీలీల, రణ్‌వీర్ సింగ్!

చింగ్స్ ఫుడ్ బ్రాండ్ కి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ బడ్జెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సినిమా బడ్జెట్ లెవెల్లో దీనిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
chings add

chings add

Chings Add: చింగ్స్ ఫుడ్ బ్రాండ్ కి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ బడ్జెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సినిమా బడ్జెట్ లెవెల్లో దీనిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో  రణ్‌వీర్ సింగ్, బాబీ డియోల్ శ్రీలీల ఈ యాడ్ లో కనిపించబోతున్నారు.  అంతేకాదు స్టార్ డైరెక్టర్ అట్లీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అట్లీ డైరెక్ట్ చేసిన 'జవాన్' సినిమాను గుర్తు తెచ్చేలా ఒక యాక్షన్ థీమ్ తో  ఈ యాడ్ ఉండబోతోందని సమాచారం. దీనికి పెట్టిన భారీ బడ్జెట్, సినిమా స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అక్టోబర్ 19న విడుదల కానుంది. 

భారీ బడ్జెట్ 

ఈ యాడ్ లో రణ్‌వీర్ సింగ్ గూఢచారి ఏజెంట్‌గా కనిపించనున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా,  బాబీ డియోల్ ప్రొఫెసర్, విలన్ పాత్రలో నటించనున్నారు. స్టార్ కాస్ట్, స్టార్ డైరెక్టర్ ఉండడంతో ఈ యాడ్ పై అంచనాలు భారీగా పెరిగాయి.  ఇటీవలే విడుదలైన బాలీవుడ్ సినిమాల బడ్జెట్ ను సైతం ఇది దాటేసింది.  ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్, మరియు డైరెక్టర్ ఉండటంతో, ఈ యాడ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు విక్కీ కౌశల్ 'ఛావా' రూ. 130 కోట్లు, రైడ్ 2 రూ. 120 కోట్లు,  'స్త్రీ 2' రూ. 60 కోట్లు కంటే కూడా చింగ్స్ యాడ్ బడ్జెట్ ఎక్కువ అని తెలుస్తోంది.  ఇది యాడ్ క్యాంపెయిన్‌ల కు పెరుగుతున్న డిమాండ్ ని సూచిస్తోంది. 

ఎందుకంత డిమాండ్.. 

'జవాన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పేరుపొందిన అట్లీ, తన మార్క్ విజువల్ స్టైల్‌ను ఈ చింగ్స్ యాడ్‌కి కూడా అందించారు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ క్యాంపెయిన్ ని చాలా స్పెషల్ గా రూపొందించారట. 

Also Read: Bigg Boss 9: పచ్చళ్ళ పాప దుమ్ముదులిపిన నాగ్ మామ.. డెమోన్, రీతూ లవ్ స్టోరీ షాకింగ్ వీడియో!

Advertisment
తాజా కథనాలు