Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో రసవత్తరంగా మారింది. గొడవలు, ట్విస్టులు, టర్నులతో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. గత వారం కంటెస్టెంట్స్ చేసిన తప్పుల చిట్టాను ఈ వీకెండ్ ఎపిసోడ్ లో విప్పితారు హోస్ట్ నాగార్జున. ఆట బాగా ఆడిన వారిపై ప్రశంసలు.. తప్పులు చేసిన వారికి చివాట్లు పెడతారు. తాజాగా ఈరోజు జరగబోయే వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలవగా.. దివ్య నిఖితకు ఫుల్ క్లాస్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఫుడ్ విషయంలో దివ్య నిఖిత- మాధురి మధ్య జరిగిన గొడవలో తప్పెవరిదో బయటపెట్టారు. ప్రోమో చూస్తుంటే.. ఈ గొడవలో హోస్ట్ నాగార్జున ఫుల్ సపోర్ట్ దువ్వాడ మాధురికే ఉన్నట్లుగా కనిపించింది. ఆమె తప్పేమి లేదన్నట్లుగా దివ్య నిఖితకు క్లాస్ ఇచ్చారు.
It’s weekend time with the King! The BiggBoss house is ready for nonstop madness! 💥👑
— Starmaa (@StarMaa) October 18, 2025
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9#StreamingNow#StarMaaPromopic.twitter.com/kk1BfOIVRF
Also Read: Bigg Boss 9: పచ్చళ్ళ పాప దుమ్ముదులిపిన నాగ్ మామ.. డెమోన్, రీతూ లవ్ స్టోరీ షాకింగ్ వీడియో!