Akhanda 2 Release: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'అఖండ 2' విడుదల తేదీ వచ్చేసింది
బాలయ్య 'అఖండ 2' మేకర్స్ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు సాల్వ్ అవడంతో మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
బాలయ్య 'అఖండ 2' మేకర్స్ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు సాల్వ్ అవడంతో మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
డిసెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 - తాండవంలో నుండి 9 పాటలతో కూడిన జ్యూక్‌బాక్స్‌ను విడుదల అయ్యింది. బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి.
టాలీవుడ్ నం. 1 హీరో ఎవరు? అన్న ప్రశ్నకు అన్ని AI టూల్స్ ఒకే సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ChatGPT, Grok, Gemini వంటి AIలు ప్రభాస్‌ను నం 1, అల్లు అర్జున్ను నం 2, నం 3లో మహేష్-రామ్ చరణ్ ను చూపిస్తున్నాయి.
ప్రభాస్- మారుతి “ది రాజా సాబ్” విడుదలకు ముందే ఏపీ-తెలంగాణల్లోనే 130 కోట్లకు పైగా భారీ బిజినెస్ చేసింది. మొదటి పాటకు వచ్చిన రెస్పాన్స్‌తో అంచనాలు పెరిగాయి. తమన్ సంగీతం, ముగ్గురు హీరోయిన్స్, హారర్ ఫాంటసీ జానర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ రన్‌టైమ్ 3 గంటలు 32 నిమిషాలుగా ఉంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది బయోపిక్ కాదని, మేజర్ మోహిత్ శర్మ కథతో సంబంధం లేదని దర్శకుడు ఆదిత్య ధర్ స్పష్టం చేశారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
అజయ్ భూపతి దర్శకత్వంలో గట్టమనేని జయకృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్‌తో కొత్త చిత్రం ప్రకటించారు. ప్రీ-లుక్‌లో చేతిలో గన్ పట్టుకున్న హీరో హీరోయిన్ ఫోటో చూపించారు. రాషా తదాని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. జీ.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కోసం విదేశాల్లో గడ్డకట్టే చలిలో షూటింగ్ చేసారని మారుతి తెలిపారు. ‘రెబెల్ సాబ్’ పాటలో 1000 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఈ భారీ కమర్షియల్ సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది. ఇదే రోజున విజయ్ ‘జనా నాయకన్’తో బాక్సాఫీస్ పోటీ ఉంటుంది.
బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబినేషన్లో NBK 111 అధికారికంగా ప్రారంభమైంది. ముహూర్తం పోస్టర్లో బాలయ్య రెండు వేర్వేరు లుక్స్‌తో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. నయనతార హీరోయిన్, తమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. షూటింగ్ వివరాలు త్వరలో రానున్నాయి.
చిన్న సినిమాగా విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాయి' థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 4 రోజుల్లో ₹9.08 కోట్లు వసూలు చేసుకొని మాండే టెస్ట్ సక్సెస్ సాధించింది. OTT హక్కులు ETV Winవి కాగా, సినిమా జనవరి 10–16, 2026 మధ్య స్ట్రీమ్ అవుతుంది.