/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/exams-jpg.webp)
exams
ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చరల్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ షెడ్యూల్‌ను జేఎన్‌టీయూ అధికారులు విడుదల చేసినట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి మే 4 వరకు పరీక్షలు జరగనున్నట్లు వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఈఏపీసెట్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాల కిష్టారెడ్డి వెల్లడించారు.
Also Read:America-Indian Students: అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!
Telangana EAP CET Exams Hall Tickets
ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరుగుతుందని, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. రోజూ రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Also Read: Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!
అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది హాజరు అయ్యే అవకాశాలున్నట్లు బాల కిష్టారెడ్డి తెలిపారు. ఫార్మా, అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఈరోజు నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు ఈ నెల 22 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఇంజినీరింగ్ విభాగానికి హైదరాబాద్ జోన్ 3లో అధికంగా 50,149 మంది, నిజామాబాద్ జోన్‌లో అత్యల్పంగా 1,650 మంది పరీక్ష రాసేందుకు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
Also Read: JEE Main: జేఈఈ (మెయిన్) సెషన్ 2 రిజల్ట్స్ వచ్చేశాయి!
telugu-news | eapcet | latest-telugu-news | latest telugu news updates | telangana eapcet 2025 updates | latest telangana news | telangana news today | telangana news live updates | telangana-news-updates | today-news-in-telugu | breaking news in telugu