/rtv/media/media_files/2025/04/11/sFz7n4vzKWovVuUIfFTn.jpg)
results
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి.శుక్రవారం మధ్యాహ్నాం ఫైనల్ కీవిడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు..తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు.
Also Read:ISS: ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు మొదటిసారిగా ఇండియన్ ఆస్ట్రోనాట్.. ఎవరో తెలుసా?
దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు జరిగాయి. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్ పాస్వర్డ్ తో పాటు క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
JEE Main 2025 Results
జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా సుమారు 10,61,850 మంది రిజిస్టర్ చేసుకోగా.. వారిలో కేవలం 9,92,350 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టారు.వీరిలో ఏపీనుంచి సాయి మనోజ్ఙ గుత్తికొండ ,తెలంగాణ నుంచి హర్ష్ ఏ గుప్తా,వంగల అజయ్ రెడ్డి,బనిబ్రత మజీ ఉన్నారు.
జేఈఈ (మెయిన్) పేపర్ -2 (బీఆర్క్/బి ప్లానింగ్) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. జేఈఈ (మెయిన్ ) సెషన్ 1,2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన బెస్ట్ స్కోరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు.
ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ రాసేందుకు అర్హత సాధించినట్లు తెలిపారు.జేఈఈ అడ్వాన్స్‌డ్ లో సత్తా చాటిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకోసం మే 18 న జరిగే జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Also Read: KL Rahul Daughter Name: క్రికెటర్ KL రాహుల్ కూతురి పేరు ఏంటో తెలుసా?.. భలే ఉందే
Also Read: Sanju Samson: రాహుల్ ద్రవిడ్ - సంజు శాంసన్ మధ్య గొడవ.. వీడియో వైరల్
telugu-news | jee-main-exams | jee-main-exam-date | latest telugu news updates | jee mains 2025 | jobs | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu
Follow Us