/rtv/media/media_files/2025/04/18/5GIa6H9ferlXN00vuuDn.jpg)
తెలంగాణలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం వరకు నిప్పులు కురిపించిన భానుడు.. సాయంత్రం కాగానే మేఘాల చాటుకి వెళ్లి చల్లబడిపోయాడు. ఆరింటికల్లా ఆకాశమంతా మేఘావృతమై.. నగరంలో ఒక్కసారి బోరున వర్షం కురిసింది. ఎస్సాఆర్ నగర్, మాదాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోఠి, నాంపల్లి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, కాచిగూడ,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వాన పడింది.
Also Read: Sanju Samson: రాహుల్ ద్రవిడ్ - సంజు శాంసన్ మధ్య గొడవ.. వీడియో వైరల్
ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఉదయం వేళల్లో ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రానికి వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: KL Rahul Daughter Name: క్రికెటర్ KL రాహుల్ కూతురి పేరు ఏంటో తెలుసా?.. భలే ఉందే
Hyderabad Weather Update
ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టం మీదగా ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్‌లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.
శుక్రవారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
Also Read: ISS: ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు మొదటిసారిగా ఇండియన్ ఆస్ట్రోనాట్.. ఎవరో తెలుసా?
telugu-news | telangana-weather-report | Telangana Weather | telangana-weather-update | latest-telugu-news | latest telugu news updates | telangana weather updates | telangana weather report today | telangana weather news | today-news-in-telugu | breaking news in telugu