పహల్గామ్, ఆపరేషన్ సింధూర్ ఘటనల తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదుల కదలికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల కశ్మీర్ లో ఆరుగురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్లో హతం అయ్యారు. వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను గుర్తించి అరెస్టులు కూడా చేస్తున్నారు అధికారులు. ఇక్కడ ఉంటూ ఉగ్రవాదులకు ఇక్కడి సమాచారాన్ని లీక్ చేస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూలాలు ఉన్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాంకు చెందిన ఇస్లాంను తాజాగా అరెస్ట్ అరెస్టు చేశారు. ఈనెల 14న ఇస్లాంను అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇస్లాం గొల్లపల్లిలో కొద్దిరోజులుగా మేస్త్రీగా పనిచేస్తున్నారు. అతను అస్సాంలోని ఓ మొబైల్ షాపులో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు అమ్మినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీలకు అమ్మినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
#OperationGhostSIM
— Incognito (@Incognito_qfs) May 18, 2025
Assam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.
7 arrested, 948 SIMs seized.
These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO
ఇండియన్ ఫోన్ నంబర్లతో పాక్ లో వాట్సాప్..
తద్వారా ఇండియా సెక్యూరిటీ సమాచారాన్ని పాక్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ ఘోస్ట్ సిమ్‌లో బయటపడ్డ ఇస్లాం బాగోతం బయటపడ్డట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఘోస్ట్ సిమ్‌లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారంతా అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు. ఇండియా ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్‌లో వాట్సప్ అకౌంట్లు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
(terrorist | india operation sindoor | telugu-news | telugu breaking news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana crime news | telugu crime news | breaking news in telugu)