Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!

హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు. సాక్ష్యాధారాలతో పట్టుకుని క్రిమినల్‌ కేసులు పెడతామని బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లను హెచ్చరించారు. చెరువులను కాపాడుకోవాలని కోరారు.

New Update
chief

Hydra Ranganath takes another key decision ponds

Hydera: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు. సాక్ష్యాధారాలతో పట్టుకుని క్రిమినల్‌ కేసులు పెడతామని బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లను హెచ్చరించారు. చెరువుల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  

చెరువులపై ప్రత్యేక నిఘా..

ఈ మేరకు శనివారం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో  హైడ్రా ఆఫీసులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణపై వారికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లోని చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. చెరువులపై నిఘా పెట్టినట్లు చెప్పారు. మట్టిపోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని క్రిమినల్‌ కేసులు పెడతామని చెప్పారు. మట్టిని ఎక్కడపోయాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, అలా కాదని ఇష్టం వచ్చిన చోట పోస్తే వాహనాలు సీజ్‌ చేయడంతోపాటు డ్రైవర్‌, వాహన, నిర్మాణ సంస్థ యజమానిపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. 

Also Read: J&K: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ..కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ముఫ్తీ

'హైడ్రా పోలీసు స్టేష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. శిఖం భూముల్లో మ‌ట్టి పోయకూడదు. చెరువుల్లో మట్టిపోస్తున్నట్లు గమనిస్తే హైడ్రా ఫోన్ నెంబర్ 9000113667తో పాటు ఎక్స్ అకౌంట్‌లో ఫిర్యాదు చేయాలి. మ‌ట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, జేసీబీల‌ వీడియోలు తీసి హైడ్రాకు పంపించండి' అని సూచించారు. చెరువుల పరిరక్షణలో విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు