RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

కోలకత్తా ఆశలపై వర్షం నీళ్ళు చల్లేసింది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. ముఖ్యంగా బ్రేక్ తర్వాత ఐపీఎల్ చూసి ఎంజాయ్ చద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. టాస్ పడకుండానే మ్యాచ్ రద్దవడంతో కేకేఆర్, ఆర్సీబీలకు చెరో పాయింట్ కేటాయించారు.

New Update
ipl 2025

RCB VS KKR

దాదాపు పది రోజు బ్రేక్ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ లు ఇవాళ మొదలయ్యాయి.  ఈరోజు బెంగళూరులో ఆర్సీబీ, కోలకత్తాల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మొదటి నుంచీ ఈ మ్యాచ్ కు వర్షం భయం ఉంది. అందుకు తగ్గట్టుగానే వాన పడి మొత్తం మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. మొదట చిన్న జల్లులే పడ్డాయి. మ్యాచ్ మొదట్లో వర్షం చిన్నగానే మొదలైంది. అది ఆగిపోతుంది..మ్యాచ్ మొదలవుతుంది అనుకున్నారు. కానీ తర్వాత వర్షం చాలా పెద్దగా అయిపోయి...ఇంక ఆడలేని పరిస్థితుల్లోకి వెళ్ళపోయింది. దీంతో మ్యాచ్ ను రద్దు చేశారు. వర్షం తగ్గితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించాలని చూశారు. కానీ, ఎడతెరిపి లేకుండా వాన కురువడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రెండు జట్లకూ చెరో పాయింట్ నూ కేటాయించారు. 

కోలకత్తా ఇంటికి..

ఈ మ్యాచ్ రద్దవడం వలన ఆర్సీబీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ కోలకత్తా నైట్ రైడర్స్ కు మాత్రం ఇది తప్పనిసరిగా గెలవాల్సి మ్యాచ్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న కేకేఆర్‌ ఈ మ్యాచ్‌ రద్దవడంతో లీగ్ దశలో ఇంటిముఖం పట్టింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉంది. చివరి మ్యాచ్ ఎస్ ఆర్హెచ్ తో ఉంది. ఒకవేళ అది గెలిచినా కోలకత్తాకు పెద్దగా ఉపయోగం ఉండదు. కేకేఆర్‌పై గెలిచి అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుందామనుకున్న ఆర్సీబీకి నిరాశే ఎదురైంది. అయితే, 12 మ్యాచ్‌లు ఆడి 17 పాయింట్లతో ఉన్న బెంగళూరు.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఛాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది.

today-latest-news-in-telugu | IPL 2025 | RCB vs KKR 

Also Read: రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న భార్య.. పట్టించిన జూమ్ కాల్.. కోర్టు ట్విస్ట్ అదిరింది!

Advertisment