Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

మెగా డాటర్ నిహారిక ఫ్యూచర్ లో డైరెక్టర్ అయితే ఏలాంటి సినిమాలు తీయాలనుకుంటుందో చెప్పేసింది. బన్నీతో లవ్ స్టోరీ, ప్రభాస్‌తో కామెడీ,  మహేశ్‌తో మైథలాజికల్‌ సినిమాలు తీస్తానని చెప్పింది. తన సినిమాల్లో మేకప్ ఎక్కువ వేసుకోనివ్వనంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.

New Update
niharika

Niharika intresting comments on prabhas

Niharika: మెగా డాటర్ నిహారిక తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా  ఓ ఈవెంట్ లో పాల్గొన్న నిహారిక.. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటుందో చెప్పింది. అల్లు అర్జున్‌తో లవ్ స్టోరీ, ప్రభాస్‌తో కామెడీ,  మహేశ్‌బాబుతో మైథలాజికల్‌ సినిమాలు చేయాలని ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన సినిమాల్లో నటీనటులు ఎక్కువ మేకప్‌ వేసుకోవద్దని తెలిపింది. ఇక ఎల్లప్పుడూ మనల్ని మనం నమ్ముకోవాలని, నిర్మాతకు మంచి స్క్రిప్టులు ఎంపిక చేసుకోమని సలహా ఇస్తానని చెప్పింది. 

ఇదిలా ఉంటే..  నిహారిక ప్రస్తుతం ‘మ్యాడ్‌’ ఫేమ్‌ సంగీత్‌ శోభన్‌ హీరోగా ప్రస్తుతం ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ మూవీకి మానస శర్మ దర్శకురాలుగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ అప్ కమింగ్ మూవీపై అనిల్ రావిపూడి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. #మెగా 157  అంటూ మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి  సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చక చక జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు నుంచి మరో కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో ఫీమేల్ లీడ్ ని పరిచయం చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్ జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నట్లు ప్రకటించారు. ఎప్పటిలాగే డైరెక్టర్ అనిల్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో కాన్సెప్ట్ తో హీరోయిన్ కి వెల్కమ్ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు