BIG BREAKING: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా టీడీపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. 1995లో చంద్రబాబు తొలిసారిగా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.