Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

పాకిస్తాన్ పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర గురించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం అవుతున్నాయి. ఆపరేషన్ కి కు ముందే భారత్, పాక్ కు సమాచారం ఇచ్చిందని...అది నేరం అని ఆయన విమర్శించారు. దీనికి బీజేపీ గట్టిగా బదులిచ్చింది. 

New Update
Rahul Gandhi

Rahul Gandhi

రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్‌కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో మే 6, 7 తేదీల్లో ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసిందని...అయితే సైనిక స్థావరాల మీద దాడి జరగలేదని పాకిస్తాన్ ప్రభుత్వానికి సందేశం పంపబడిందని జై శంకర్ రాశారు. కానీ వారు మా సలహా తీసుకోలేదని చెప్పారు. 

ముందు సమాచారం ఇవ్వడం ఏంటి..

దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. దాడికి ముందు పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వడం నేరం అని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వమే నేరానికి పాల్పడ్డట్టు విదేశాంగ మంత్రి బహిరంగంగా అంగీకరించారు అని ఆరోపించారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి సందర్భంగా భారత వైమానిక దళం ఎన్ని వీడియోలను కోల్పోయింది .? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 

రాహుల్ గాంధీ పోస్ట్ పై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వడం తప్పుడు ప్రకటన అని చెప్పింది. మరోవైపు రాహుల్ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ  మండిపడ్డారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత, పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై దాడులు చేసింది. దాని గురించి చెబుతూ జైశంకర్ ఆ వాఖ్యలు చేశారని...కానీ వాటిని ఆపరేషన్ సిందూర్‌కి ముందే చేసినట్లు తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

today-latest-news-in-telugu | operation Sindoor | jai-shankar

Also Read: J&K: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ..కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ముఫ్తీ

#jai-shankar #operation Sindoor #Rahul Gandhi #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు