BIG BREAKING: అన్నకు రాఖీ.. కేటీఆర్ ఇంటికి కవిత?
రాఖీ పండుగ వేళ తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కేటీఆర్ ఇంటికి కవిత వెళ్లి రాఖీ కడుతుందా? లేదా? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది.
రాఖీ పండుగ వేళ తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కేటీఆర్ ఇంటికి కవిత వెళ్లి రాఖీ కడుతుందా? లేదా? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది. వీరు పార్టీ ఫిరాయించినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మిగతా MLAలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. శని, ఆదివారాల్లో రాష్ట్రాల్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు పరిష్కరించాలని ఆయన కోరారు.
చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను బీసీలు వదిలి పెట్టరని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 24వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నెమ్మదిగా కవితను పార్టీకి దూరంపెడుతున్నట్లు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఆమెపై చేసిన అనువ్యాఖ్యలపై పార్టీ సరైన రీతిలో స్పందించలేదు.
హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నేటి నుంచి 19వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ NRI సెల్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆయనను తమ రక్షణలో పోలీస్ స్టేషన్కు తరలించారు.