School Holidays: విద్యార్ధులకు పండగే.. నేడు ఆ జిల్లాల్లో విద్యా సంస్థలన్నీంటికి సెలవు.. కారణమిదే!

తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లు ఇలా అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది.

New Update
school holidays

school holidays

తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటన వెల్లడించారు. బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్, కామారెడ్డి జిల్లాలు మునిగాయి. కురిసిన కుండపోత వర్షాల వల్ల కాలనీలు అన్ని నీటితో నిండిపోయాయి. కామారెడ్డి జిల్లాలో ఆర్గొండలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మెదక్‌లోని నాగ్‌పూర్‌లో 20.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇది కూడా చూడండి: RAINS : వర్షాలకు తెలంగాణ అతలాకుతలం...పలువురు గల్లంతు..అప్రమత్తమైన సర్కార్‌

మరో మూడు గంటల్లో భారీ వర్షం..

తెలంగాణలో కామారెడ్డి, మెదక్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లంతా మునిగాయి.  ప్రజలు బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. అలాగే వర్షం వల్ల కరెంట్ తొందరగా పాస్ అవుతుంది. కాబట్టి వినాయక మండపాల దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్‌ఫార్మర్లకు ఎలాంటి ప్రమాదం రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో కూడా మరో మూడు గంటలు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కూకట్‌పల్లి, అల్వల్, సికింద్రాబాద్, ఉప్పల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చూడండి: Red Alert : తస్మాత్‌ జాగ్రత్త...రేపు తెలంగాణకు IMD రెడ్ అలెర్ట్ జారీ..

భారీ వర్షాలు తెలంగాణలో కురుస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచనలు చేశారు. బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. హైద‌రాబాద్  న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాల‌ని సీఎం ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లతో భ‌క్తుల‌కు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది అందరూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

Advertisment
తాజా కథనాలు