Red alert : తెలంగాణకు రెడ్ అలర్ట్..రాబోవు మూడు గంటల్లో కుండపోత

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాబోయే మూడు గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

New Update
rains

Red alert for telangana

Red alert :  తెలంగాణ వ్యాప్తంగా  వర్షబీభత్సం మామూలుగా లేదు.. గ్యాప్‌ లేకుండా దంచికొడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడమే కాదు.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది.  పలు చోట్ల రైల్వే ట్రాక్‌లు తెగిపోయాయి.  అనేక ప్రాంతాల్లో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా నిన్న మద్యాహ్నం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రమంతటా వర్షాల ధాటికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు  రాబోయే మూడు గంటలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాబోయే మూడు గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చూడండి:Vaishno Devi Yatra: విషాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య (VIDEOS)

మరో  మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  దాని కారణంగా ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఊర్లకు ఊర్లే మునిగిపోతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వ్యక్తులు గల్లంతు అవుతున్నారు. వీలైనంత వరకు వాగుల వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రోడ్లు మునిగిన ప్రాంతాల్లో ఎవరూ వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. రాబోయే 24 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. --కుండపోత వానలతో  కామారెడ్డి, మెదక్ జిల్లాలు పూర్తిగా మునిగి పోయాయి. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇది కూడా చదవండి:నర్సాపూర్ ట్రైన్‌లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!

Advertisment
తాజా కథనాలు