Telangana Heavy Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు.. 25 జిల్లాలకు బిగ్ అలర్ట్.. డేంజర్ జోన్‌లో ఈ 11 జిల్లాలు!

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అధికారులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 25 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

New Update
kamareddy

kamareddy

Telangana Heavy Rains: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణాలో  కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుణు దేవుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లాల్లో రికార్డు స్థాయికి మించి వర్షపాతం నమోదవుతోంది. కుండపోత వర్షాలు కురవడంతో రాష్ట్రంలో ఉన్న చెరువులు, వాగులు అన్ని కూడా పొంగుపొర్లుతున్నాయి. మరో మూడు గంటల్లో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని  ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కామరెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఈ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

ఇది కూడా చూడండి: School Holidays: విద్యార్ధులకు పండగే.. నేడు ఆ జిల్లాల్లో విద్యా సంస్థలన్నీంటికి సెలవు.. కారణమిదే!

హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మెదక్, కామారెడ్డి  జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. అలాగే కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు కూడా కొట్టుకునిపోయాయి. ఈ క్రమంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ రోజంతా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కేవలం మెదక్, కామారెడ్డిలోనే కాకుండా నిజమాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి,  నాగర్ కర్నూల్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇకపోతే హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మాదాపూర్, పటాన్ చెరువు, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, అమీర్‌పేట, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Telangana Floods : కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పరిస్థితి ఘోరం VIDEO.. ఈరోజు మరో 2 జిల్లాల్లో డేంజర్‌

Advertisment
తాజా కథనాలు