/rtv/media/media_files/2025/08/28/heavy-rains-2025-08-28-07-15-17.jpeg)
అల్పపీడన కారణంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. గురువారం మెదక్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1cm, వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.3 cm, మెదక్ జిల్లా సర్దానలో 30.2cm, కామారెడ్డి పట్టణంలో 28.9cm, కామారెడ్డి జిల్లా భిక్‌నూర్‌లో 27.9 cm వర్షాపాతం నమోదైంది.
నీట మునిగిన కామారెడ్డి డ్రోన్ విజువల్స్
— Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) August 27, 2025
ఇప్పటికి నష్టపరిహారాల్లో తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇయ్యని కేంద్రం
కనీసం బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కామారెడ్డికి అయిన నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్న. pic.twitter.com/tyGCH6DXRV
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం పోచారం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు..
— RTV (@RTVnewsnetwork) August 28, 2025
వరద ఉధృతికి ప్రాజెక్టు గండి పడిన వైనం..
ఆందోళనలో ఇరిగేషన్ అధికారులు, పోచారం గ్రామస్తులు.#Telangana#pocharamproject#HeavyRain#Floods#RTVpic.twitter.com/hGZG9bHPs2
నిర్మల్ జిల్లా వడ్యాల్‌లో 27.9 cm, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 cm, మెదక్‌జిల్లా నాగాపూర్ గ్రామంలో 26.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెం.మీ, లింగంపేటలో 22.5 సెం.మీ, దోమకొండలో 20.2 సెం.మీ, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లో 24.1 సెం.మీ, ముజిగిలో 23.1 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెం.మీల వర్షం పాతం నమోదైంది.
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది.
— RTV (@RTVnewsnetwork) August 27, 2025
వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో వాగులు ఉప్పొంగుతున్నాయి.
కారులో నలుగురు ప్రయాణికులు ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించగా, ఆందోళన చెలరేగింది.
ఘటనపై… pic.twitter.com/jyx1ngJcgg
భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించాయి. కామారెడ్డి -భిక్కనూర్ మార్గంలో రైల్వే ట్రాక్ కింద భారీ గండిపడింది.
భారీ వర్షాలకు కామారెడ్డిలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
— RTV (@RTVnewsnetwork) August 27, 2025
కామారెడ్డి - నిజామాబాద్ మార్గంలో వెళ్లే అన్ని రైళ్లను నిలిపివేశారు.#kamareddy#railwaytrack#heavyrains#RTVpic.twitter.com/5BO2voAOa7
దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి-తిమ్మారెడ్డి రహదారిపై కళ్యాణి ప్రాజెక్ట్ బ్రిడ్జి పొంగిపొర్లింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.#kamareddy#heavyrains#RTVpic.twitter.com/Gyp7zGPhyn
— RTV (@RTVnewsnetwork) August 27, 2025
భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు.