/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
Son Killed Mother for insurance money..
Son Killed Mother: అమ్మను మించి దైవం లేదంటారు.తల్లి ప్రేమకు ఎవరు సాటి రారు. నవమాసాలు మోసి, కనిపెంచి పెద్ద చేసిన తల్లిని దేవత లాగా ఆరాధించేవారులేకపోలేదు. తన పిల్లలపై ఈగ వాలినా తట్టుకోలేదు. కేవలం మనుషుల్లోనే కాదు పశు,పక్ష్యాదులు తమ తల్లిని పరాయివారు ఏమన్నా తట్టుకోలేవు. కానీ నేటి సమాజంలో కొందరు కసాయి కొడుకులు తల్లి ప్రేమకు వెలకడుతున్నారు. వారి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తూ వారిని అనాథశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఇంకొందరైతే వారిని కర్కషంగా కడతేరుస్తున్నారు. మనుషుల్లో మానవత్వం రోజురోజుకు అడుగంటుతోంది. తల్లి, చెల్లి, భార్య, పిల్లలు అనే బంధాలకు సంబంధం లేకుండా మనషులు ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం అవసరమైతే అయిన వారిని కూడా అంతం చేయడానికి వెనుకాడటం లేదు. తాజాగా.. ఓ తల్లిని కన్నకొడుకే దారుణంగా కడతేర్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రమాద బీమా సొమ్ము కోసం తల్లిని చంపేశాడో దుర్మార్గుడు. నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలం తాండూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
తాండూరు గ్రామంలో చాకలి జమున అనే మహిళను ఆమె కొడుకు రాజు దారుణంగా హత్య చేశాడు. అది కూడా ఆస్తి కోసమే తన కన్నతల్లిని చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పేరున ఉన్న ప్రమాద బీమా సొమ్ము కోసమే రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తాండూరు గ్రామానికి చెందిన చాకలి జమున (46) అనే మహిళ ఈ ఏడాది జనవరి 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆమె ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడి మరణించినట్లు కేసు నమోదు చేశారు. అయితే ఆరు నెలల తర్వాత ఆమె కొడుకు చాకలి రాజు (28) ఒక హత్యాయత్నం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో అతన్ని విచారించిన పోలీసులకు తన తల్లి మరణానికి సంబంధించిన అసలు విషయం వెలుగు చూసింది.
గత జూలై నెలలో మండలంలోని ఆత్మాకూర్ గ్రామ గేటు సమీపంలో అక్రమ సంబంధంతో భర్తను చంపేందుకు భార్య కుట్ర పన్నిన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న జాన్సన్, సంపూర్ణ, చాకలి రాజు, నవీన్ అనే వ్యక్తులను సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో చాకలి రాజు తల్లిని చంపిన సంఘటన వెలుగు చూసిందని ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.
తాండూర్ గ్రామానికి చెందిన చాకలి రాజు ఏం పని చేయకుండా తిరుగుతుండటంతో తల్లి మందలించింది. తల్లి మాటలు వినని రాజు, ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. ఇదే సమయంలో జమున పేరిట బీమా సంస్థల్లో సుమారు రూ. 80 లక్షల ప్రమాద బీమా ఉందని తెలుసుకున్న రాజు ఆ డబ్బును కాజేయాలని ప్లాన్ వేశాడు. జనవరి 9న రాత్రి 11.30 గంటల సమయంలో చాకలి రాజు తన తల్లి చాకలి జముననే రాళ్లతో తలపై కొట్టగా తలకు తీవ్ర గాయమై మరణించింది. అయితే జమున ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు చిత్రీకరించాడు. పోలీసులు కూడా ప్రమాదవశాత్తు జరిగినట్లు నమ్మారు. అయితే ఇన్సూరెన్స్ పత్రాలలో తన తల్లి డేట్ అఫ్ బర్త్ తప్పుగా ఉండడంతో ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. ఇదిలా ఉండగా భర్తను చంపిన భార్య హత్యాయత్నం కేసు విచారణ సమయంలో రాజు తన తల్లిని తానే బండరాళ్లతో కొట్టి చంపినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. రాజు వాంగ్మూలంతో పోలీసులు జమున కేసును తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:'నోరా ఫతేహి'లా మారుతావా లేదా లేపేయన..? భార్యకు 3 గంటలు జిమ్లో చుక్కలు చూపించిన భర్త..!