/rtv/media/media_files/2025/08/28/kamareddy-2025-08-28-11-48-22.jpg)
Kamareddy Rains
Kamareddy Rains: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అక్కడ ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. GRకాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్(Nizamabad), సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డిలో దాదాపుగా -15 గంటల వ్యవధిలో ఏకంగా 500 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో పట్టణం పూర్తిగా నీట మునిగిపోయింది. కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసిన వరద విలయమే కనిపిస్తోంది. ఎక్కడ చూసిన నాలుగు అడుగుల వరకూ నీరు నిలబడిపోయింది.
136 మి.మీ. వర్షపాతం
కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో ఆగస్టు 27రాత్రి 12 గంటల నుంచి 28వ తేదీ ఉదయం 8 గంటల వరకు దాదాపుగా 136 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో 363 మి.మీ. వర్షం కురిసిందని, ఇది అసాధారణ వర్షపాతమని అంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, తిమ్మారెడ్డి, కల్యాణి వాగు పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మంజీరా నది ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి.
Also Read: భారత్ మంచితనం.. లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్
ఇక లక్ష్మాపూర్ వద్ద ఒక కల్వర్ట్ కూలిపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. వ్యవసాయ భూములు నీట మునిగాయి, వేలాది ఎకరాల పంటలు నాశనమయ్యాయి. రైల్వేట్రాకులు కూడా కొట్టుకుపోవడంతో అటు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. పదుల సంఖ్యలో వంతెనలు ధ్వంసం అయ్యాయి. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు పూర్తిగా నీటమునిగింది. ప్రజా ఆస్తులు పెద్ద ఎత్తున వరదలో కొట్టుకుపోయాయి. కొన్ని వందల కార్లు అలా చెరువుల్లోకి ,వాగుల్లోకి కొట్టుకు పోతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో రోజు కూడా ఇలాంటి వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో కామారెడ్డి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే అలెర్ట్అయింది.
దంచికొడుతున్న వర్షాలు
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ చేసింది, మిగతా జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : బిహార్‌లో ముగ్గురు జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు.. ఎలా వచ్చారో తెలిస్తే షాక్!