Heavy Rains: కామారెడ్డికు తప్పని గండం.. నేడు కూడా ఈ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు!

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

New Update
kamareddy

Heavy rains

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణలో నేడు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజుల నుంచి కామారెడ్డి, మెదక్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడక్కడ నీరు స్తంభించిపోయింది. రోడ్లు, రైలు మార్గాలకు ఆటంకం ఏర్పడింది. ఎక్కడిక్కడ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. వాగులు, వంకలు నిండిపోయాయి. బయటకు వెళ్లడానికి మార్గం లేదు. అయితే నేడు కూడా కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇది కూడా  చూడండి: CM Revanth Reddy : మేడిగడ్డ కూలింది. ఎల్లంపల్లే మనకు దిక్కు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

ముఖ్యంగా నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే వరంగల్, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, ఆరెంజ్ హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, లేకపోతే వెళ్లకపోవడం మంచిదని వెల్లడించింది. 

ఇదిలా ఉండగా కామారెడ్డిలో భారీ వర్షాల కారణంగా NH44 హైవేకి గండి ఏర్పడింది. దీంతో టెక్రియల్ బైపాస్ వద్ద ఒక వైపు రోడ్డు మూసివేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇది కూడా  చూడండి: Srisailam reservoir:  శ్రీశైలం జలాశయం వద్ద విరిగిపడ్డ కొండ చరియలు..అప్రమత్తమైన అధికారులు

Advertisment
తాజా కథనాలు